: నేనే 20 లక్షలిస్తా... నా కొడుకుని నాకు తెచ్చివ్వండి: మధుర అల్లర్లలో మరణించిన ఎస్పీ తల్లి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించిన 20 లక్షల రూపాయల నష్టపరిహారం తమకు వద్దని, కావాలంటే తానే ఓ 20 లక్షల రూపాయలు ఇస్తానని, తన కుమారుడిని సజీవంగా తెచ్చివ్వాలని మధుర అల్లర్లలో మృత్యువాతపడిన ఎస్పీ ముకుల్ ద్వివేదీ తల్లి డిమాండ్ చేశారు. మధురలో ఆమె మాట్లాడుతూ, తన ఇద్దరు కుమారుల్లో ఒకరు దుబాయ్ లో ఉండగా, రెండో కొడుకు బరేలీలో చక్కగా ఉద్యోగం చేసుకునేవాడని అన్నారు. బరేలీలో ఉద్యోగం చేసుకునే వాడిని ప్రమోషన్ పేరిట మధురకు తీసుకువచ్చారని, అలా జరగకపోయి ఉంటే తన కుమారుడు క్షేమంగా ఉండేవాడని చెప్పిన ఆమె, ఇప్పుడు సీఎం తన కుమారుడ్ని తనకు తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.