: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ కు నిరాశ


ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుతంగా రాణించి క్వార్టర్ ఫైనల్‌లో ప్ర‌వేశించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు నిరాశే ఎదుర‌యింది. స్పెయిన్ ష‌ట్ల‌ర్ కరోలినా మారిన్ చేతిలో సైనా నెహ్వాల్ 22-24, 11-21 తేడాతో ప‌రాజ‌యం పాలైంది. తొలిగేమ్‌లో ఓ ద‌శ‌లో సైనా ధాటిగా ఆడడంతో విజ‌యం సాధించే సూచ‌న‌లు క‌నిపించాయి. అయితే, కరోలినా మారిన్ పుంజుకొని చెల‌రేగ‌డంతో తొలిగేమ్‌లో సైనాకి ఓట‌మి త‌ప్ప‌లేదు. రెండో గేమ్‌లోనూ విజ‌యం మారిన్‌నే వ‌రించింది. దీంతో సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్ టైటిల్ ను గ‌తంలో మూడు సార్లు (2009, 2010, 2012) గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News