: తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ హఠాన్మరణం
తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్(62) గుండెపోటుతో ఈరోజు హఠాన్మరణం పొందారు. కోయంబత్తూరులోని నివాసంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బాలు ఆనంద్ కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, బాలు ఆనంద్ సుమారు 100 సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. పిస్తా, అన్నా నగర్ ఫస్ట్ స్ట్రీట్, అన్బె శివమ్ తదితర సినిమాల్లో ఆయన నటించారు.