: ఉరుకులు, పరుగుల మీద కోర్టుకు విజయసాయిరెడ్డి... నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని వినతి
వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో రెండవ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, నేటి విచారణకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేయగా, మధ్యాహ్న భోజన విరామం తరువాత విజయసాయి కోర్టుకు హాజరయ్యారు. వారెంటు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఉరుకులు, పరుగుల మీద కోర్టుకు వచ్చి, అనారోగ్యం వల్లనే ఉదయం రాలేకపోయానని, వారెంటును రీకాల్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను తప్పించుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంటును ఉపసంహరించుకోవాలని ఆయన వేసిన పిటిషన్ పై మరికాసేపట్లో వాదనలు జరుగుతాయని తెలుస్తోంది. వారెంటును వెనక్కు తీసుకునే అవకాశాలే అధికమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.