: యనమలకూ కోపమొచ్చింది!... జగన్ కు రోజులు దగ్గరపడ్డాయని సంచలన వ్యాఖ్య!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి కూడా కోపం తెప్పించాయి. కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ పై యనమల నిప్పులు చెరిగారు. జగన్ కు రోజులు దగ్గరపడ్డాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు. ఇప్పటికే రూ.43 వేల కోట్ల విలువ చేసే జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుట్టుకతోనే నేర చరిత్ర ఉన్న జగన్ కు చంద్రబాబును విమర్శించేంత స్థాయి లేదని యనమల ధ్వజమెత్తారు.