: చంద్ర‌బాబు సహా టీడీపీ నేత‌ల మాన‌సిక పరిస్థితే బాగోలేదు: జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన‌ జోగి రమేష్


వైసీపీ అధినేత‌ జగన్ లాంటీ హీరో రాష్ట్రంలో లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాథుడే కనపడడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఈరోజు మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌లు చేస్తోన్న‌ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. చంద్ర‌బాబుకి, టీడీపీ నేత‌లకే మాన‌సిక పరిస్థితి బాగోలేదని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండ‌డం నేర‌మా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. హామీలు అమ‌లు చేయ‌మ‌ని అడ‌గడం త‌ప్పా..? అని దుయ్య‌బ‌ట్టారు. హామీలు కురిపిస్తూ మీరు పెట్టిన ఐదు సంత‌కాల్లో ఒక్క‌టైనా నెర‌వేర్చారా..? అని టీడీపీ నేత‌ల‌కు ప్ర‌శ్నించారు. తాగ‌డానికి నీళ్లు కూడా లేని ప‌రిస్థితుల‌ని తీసుకొచ్చిన చంద్ర‌బాబు, దేవినేని కలసి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని జోగి రమేష్ అన్నారు. చంద్ర‌బాబు నాయుడు రైతుల భూములు తీసుకొని వారి పొట్టగొట్టారని ఆయ‌న అన్నారు. తీసుకున్న భూములను వేలకోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. రైతుల ప‌క్షాన త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News