: అనుష్కను దగ్గరుండి మరీ ఫ్లయిటెక్కించిన కోహ్లీ... కలిసున్నట్టేనా?
సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మలు మళ్లీ కలిసిపోయారా? గతంలో విభేదాలు వచ్చి విడిపోయారని ఖరారు చేసిన పేజ్-3 పీపుల్, ఈ ఘటన చూసి వారిద్దరూ తిరిగి కలిశారన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'సుల్తాన్' షూటింగ్ బుడాపెస్ట్ లో జరగాల్సి వుండగా, అందుకు ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. ఆమెకు సెండాఫ్ ఇచ్చేందుకు విరాట్ కోహ్లీ స్వయంగా ఎయిర్ పోర్టుకు రావడం, అది కూడా ఒకే కారులో పక్కపక్కన కూర్చుని రావడం, అనుష్కను దగ్గరుండి విమానం ఎక్కించడం మీడియా కెమెరాలకు చిక్కింది. మూడు నెలల క్రితం తామిద్దరం విడిపోయినట్టేనని బుంగమూతి పెట్టి 'గుండె పగిలింది' అంటూ సామాజిక మాధ్యమాల్లో చిత్రాలను పోస్టు చేసిన కోహ్లీ, ఆపై అనుష్కతో రెండు మూడు సార్లు కలిసి కనిపించాడు. ముంబై రెస్టారెంటులో డిన్నర్ చేస్తూ చిక్కాడు. తాజాగా ఎయిర్ పోర్టు సెండాఫ్ తో వీరు కలిసిపోయినట్టేనని సోషల్ మీడియా చర్చించుకుంటోంది.