: తెలంగాణను చూసి చంద్రబాబుకు కడుపుమంట: నాయిని ఎద్దేవా
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని, అందువల్లే సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసిందే నీళ్లు, నిధుల కోసమని గుర్తు చేశారు. నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. ఆయనకు కడుపుమంట మంచిది కాదని అన్నారు. తెలంగాణలోని ఆంధ్రా ప్రజలంతా తెలంగాణ వాసులేనని చెప్పిన ఆయన, ఇక్కడి వారి పొట్టగొట్టేందుకు చూస్తున్న వారంతా శత్రువులేనని తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.