: జగన్ ను తిట్టాల్సిందంతా తిట్టి, నేను అనట్లేదన్న వర్ల రామయ్య!


"పనికిమాలిన వాడా... మీ నాన్నకు సమకాలీకుడు, అతన్ని కొడతావా? మీ నాన్న బతికుంటే ఆయన్ను కూడా కొడతావు. అటువంటి పనికిమాలిన వాడివి. స్టుపిడ్ ఫెలో" అని జగన్ పై నిప్పులు చెరిగిన తెలుగుదేశం నేత వర్ల రామయ్య, ఇవన్నీ తాను అంటున్నవి కావని, జగన్ తల్లి విజయమ్మ తిట్టాల్సినవని ముక్తాయింపు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన "నీ తల్లిని చెప్పమను. విజయమ్మ గారిని చెప్పమను, నా కొడుకు చేసిన వ్యాఖ్యలు సరైనవేనని. నీ భార్య భారతిని చెప్పమను, నా భర్త సరిగ్గానే మాట్లాడాడని. వారు చెప్పలేరు. నేను అడుగుతున్నా... భారతీ దేవీ, నీ భర్త మాటలను సపోర్టు చేస్తారా? యస్... నా భర్త కరెక్టుగా మాట్లాడారని చెప్పగలరా? నా భర్త బహుచక్కగా మాట్లాడుతున్నారని చెప్పమనండి. ఆమె చెప్పలేరు. నీవు మనిషివా? మానవత్వం ఉందా? ఇంగితజ్ఞానం లేని నువ్వేం నాయకుడివయ్యా బాబూ... జగన్... నీ మీద అసభ్య పదజాలం వాడాలని అనిపించింది. కానీ వాడను" అంటూ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News