: విమర్శలు వస్తూనే ఉంటాయి.. అవే విజయానికి బాటలు: అమితాబ్ స్ఫూర్తిదాయక మాటలు
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. విమర్శలు మనకు ఎంతో ముఖ్యమని, అవి మనల్ని మనం ఇంకా అభివృద్ధి పరుచుకునేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. విమర్శలని తానెప్పుడు పనికి రాని మాటలుగా భావించబోనని ఆయన అన్నారు. తన జీవితంలో వాటినే బలమైన స్ఫూర్తి దాయకమైన మాటలుగా ఉపయోగించుకుంటానని ఆయన పేర్కొన్నారు. సెలబ్రెటీలపై ఎన్నో ప్రశంసలు మాత్రమేకాక, విమర్శలూ వస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా అమితాబ్ పలు సూచనలు చేశారట. సినిమాలు పరాజయం పాలయినప్పుడు వచ్చే విమర్శలను ఓ గోడపై రాసి ఉంచుకోవాలని ఆయన అభిషేక్‌కి సూచించారట. ప్రతీరోజు వాటిని చూసుకుంటే మన జీవితాన్ని మరోకోణంలో చూడొచ్చని, వచ్చిన విమర్శలను అధిగమిస్తూ విజయం వైపు అడుగులేసే స్ఫూర్తిని పొందొచ్చని ఆయన చెప్పారట.