: ముందుకా?... వెనక్కా?: యాడికిలో కార్యకర్తలతో వైఎస్ జగన్ మంతనాలు!


రైతులకు భరోసా ఇచ్చేందుకంటూ చేపట్టిన రైతు భరోసా యాత్రను కొనసాగించాలా? వద్దా? అన్న డైలమాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడిపోయారు. అనంతపురం జిల్లాలో మూడు రోజుల క్రితం జగన్ చేపట్టిన యాత్రకు జనం నుంచి భారీ స్పందనే లభించింది. ఈ క్రమంలో నిన్న జిల్లాలోని పెద్ద వడుగూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును చెప్పులతో కొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. జగన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు ఆయన యాత్రను అడ్డుకుని తీరతామని ప్రకటించాయి. నిన్నటి యాత్రను ముగించుకున్న జగన్ యాడికిలోని పార్టీ నేత ఇంటిలో బస చేశారు. నేటి ఉదయం ఆయన యాత్ర ప్రారంభం కాకముందే జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు, మరోవైపు జగన్ కు మద్దతుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు , ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తన యాత్రకు పోలీసులు అనుమతిస్తారా? అన్న డైలమాలో పడిపోయిన జగన్... యాత్రను కొనసాగించాలా? ఇక్కడితో ముగించాలా? అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఈ మేరకు ఆయన తన సన్నిహితులతో యాడికిలోనే చర్చల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News