: ఇంట‌ర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్న రెండో దేశంగా భార‌త్.. మూడో స్థానానికి ప‌డిపోయిన యూఎస్‌


ప్ర‌పంచంలో ఇంట‌ర్నెట్‌ను అత్య‌ధికంగా ఉప‌యోగిస్తున్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో నిలవగా, భార‌త్ రెండో స్థానంలో నిలిచింది. ప్ర‌పంచంలో మొత్తం మూడు బిలియ‌న్ల మంది ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ విషయంలో నిన్నటివరకు రెండో స్థానంలో అమెరికా వుండేది. ఇప్పుడా దేశం మూడో స్థానానికి దిగిపోయింది. 227మిలియ‌న్ల (22.7కోట్ల మంది) యూజ‌ర్ల‌తో భార‌త్ ప్ర‌పంచంలో ఇంట‌ర్నెట్ ను అత్య‌ధికంగా ఉప‌యోగిస్తోన్న రెండో దేశంగా అవ‌త‌రించింది. ప్ర‌పంచ ఇంట‌ర్నెట్‌ యూజ‌ర్ల‌లో భార‌తీయుల శాతం 2 శాతంగా ఉంది.

  • Loading...

More Telugu News