: విజయసాయిరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్లు!... వైసీపీ నేతలకు ఝలక్కిచ్చిన సీబీఐ కోర్టు!
రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు భారీ ఝలక్కిచ్చింది. ఆయనకు కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన అన్ని కేసుల్లో సాయిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులపై ఇటీవల రెగ్యులర్ గా విచారణ చేపట్టిన నాంపల్లిలోని సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం ఈ కేసుల విచారణ పర్యవేక్షిస్తోంది. ఇటీవల ఈ విచారణకు సాయిరెడ్డి వరుసగా హాజరు కాలేదు. దీంతోనే నేటి విచారణలో భాగంగా ఆయనకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా పడింది.