: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జియో 4జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం... 90 రోజుల ఉచిత డేటా


స్మార్ట్ ఫోన్ కస్టమర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో 4జీ ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరంలో ట్రయల్ బేస్ గా రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే దగ్గరైన ఈ ఫోన్ల అమ్మకాలను అన్ని నగరాల్లో విడుదల చేసినట్టు రిలయన్స్ వెల్లడించింది. ఈ ఫోన్ తో పాటు 90 రోజుల ఉచిత 4జీ డేటాను అందిస్తున్నామని, 4,500 నిమిషాల ఉచిత ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చని వెల్లడించింది. జియో డాట్ కాం వెబ్ సైట్ లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చని తెలిపింది. తొలుత రిలయన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి రిక్వెస్ట్ తెచ్చుకుంటేనే జియో 4జీ సేవలను పొందవచ్చని చెప్పిన రిలయన్స్, ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News