: అటు వైసీపీ కార్యకర్తలు... ఇటు టీడీపీ శ్రేణులు: ‘అనంత’లో హైటెన్షన్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలానే ఉంది. జిల్లాలోని పెద్ద వడుగూరులో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ కలకలం రేపారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ యాత్రను అడ్డుకుని తీరతామని పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి నేటి ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం యాడికిలో మొదలైన జగన్ యాత్రకు భద్రతగా భారీ సంఖ్యలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇక జగన్ యాత్రను అడ్డుకుంటే సహించేది లేదని చెబుతూ వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పటికే యాత్ర వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోకముందే... జగన్ యాత్రను అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు వెనక్కు పంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు విషయం తెలుసుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఓ వైపు వైసీపీ కార్యకర్తలు... అక్కడికి కూతవేటు దూరంలో టీడీపీ శ్రేణులు... మధ్యలో భారీ సంఖ్యలో పోలీసులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News