: టాప్ 100 క్రీడాకారుల్లో ఇండియా నుంచి ఇద్దరే ఇద్దరు క్రికెటర్లు!


ప్రపంచవ్యాప్తంగా టాప్ -100 క్రీడాకారుల జాబితాను ఈఎస్పీఎన్ ప్రకటించగా, ఇండియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే స్థానం లభించింది. వారే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నంబర్ వన్ పొజిషన్లో నిలువగా, కోహ్లీ 8వ స్థానంలో, ధోనీ 14వ స్థానంలో నిలిచారు. భారత టెన్నిస్ తార సానియా మీర్జా ఈ జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి వీరు ముగ్గురికి మాత్రమే స్థానం లభించింది. ఇక ఈ ఎలైట్ జాబితాలో 92 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. ఎన్నో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కన్నా కోహ్లీ ముందు నిలవడం గమనార్హం. రొనాల్డో తరువాత లీబార్న్ జేమ్స్, లియోనెల్ మెస్సీ, నెయిమార్, ఫెదరర్, కెవిన్ డురాంట్, టైగర్ వూడ్స్, విరాట్ కోహ్లీ, జేమ్స్ రోడ్రిజ్, నాదల్, కోబీ బ్రయాంత్ం గెరాత్ బాలీ, ఫిల్ మైకేల్ సన్, ధోనీ, ఉసేన్ బోల్ట్, జకోవిచ్, రూనీ, మారియా షరపోవా, మెసుట్ ఓజిల్, రోరీ మెక్ రాయ్ లు టాప్ 20 క్రీడాకారులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News