: నేను అనుకుంటే... ఇప్పుడే నిన్ను చెప్పులతో కొట్టిస్తా!: జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వేగంగా స్పందించారు. తన నియోజకవర్గ పరిధిలో తమ పార్టీ అధినేతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో జేసీ క్షణాల్లో మీడియా ముందుకు వచ్చారు. ‘‘నేను అనుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమివేయగలను. తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావు? ముఖ్యమంత్రిని కాదు... ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైంది’’ అని జేసీ నిన్న తాడిపత్రిలో జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News