: అందుకే, ప్రభాస్ కు ‘రేంజ్ రోవర్’ ఉచితంగా ఇచ్చారట!
‘బాహుబలి’ చిత్రంతో ఒక రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్ తన స్థాయికి తగ్గట్టుగానే తాను ఏ కారును ఉపయోగించుకోవాలో నిర్ణయించుకున్నాడు. రేంజ్ రోవర్ ఎస్.వి. ఆటోబయోగ్రఫీ ఎడిషన్ కారును గతంలో బుక్ చేశాడట. అయితే, గత ఏడాది జూన్ లో ఈ కారును డెలివరీ చేయాల్సి ఉండగా, ఇంతవరకూ ఇవ్వలేదట. కొత్త కారు డెలివరీ అయ్యే వరకూ మరో రేంజ్ రోవర్ ను ఉచితంగా వాడుకోమని ప్రభాస్ కు సదరు సంస్థ ఆఫర్ ఇచ్చిందట. కాగా, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘బాహుబలి’ సీక్వెల్ పై అభిమానుల అంచనాలు బాగానే ఉన్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన ‘బాహుబలి’ సినిమా విడుదలై పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.