: బెజవాడ రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్


బెజవాడలో మళ్లీ రౌడీయిజం కనిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. వచ్చే రెండు నెలల్లో సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ నేరం జరిగినా కంట్రోల్ రూంకు తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రతి రోడ్డులో, షాపింగ్ మాల్ లో కెమెరా ఉంటుందని, చిన్న తప్పు చేసినా కంట్రోల్ రూంలో తెలిసిపోతుందన్నారు. అందుకని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విజయవాడలో పెరిగిపోయిన అద్దెలు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News