: గంటాకు వైరల్ ఫీవర్...అందుకే నవనిర్మాణ దీక్షకు డుమ్మా


ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వైరల్‌ ఫీవర్ తో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది మాట్లాడుతూ, గంటాకు జ్వరం కారణంగా వివిధ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, జ్వరం కారణంగా ఆయన వాటన్నింటిని రద్దు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని వారు చెప్పారు. జ్వరానికి చికిత్స తీసుకుంటున్నారని, దీని నుంచి ఉపశమనం పొందగానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, రెండు రోజులపాటు అధికారిక కార్యమాలన్నీ రద్దయ్యాయని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News