: ఏనుగు మాంసం రుచి గురించి చెప్పి వివాదంలో ఇరుక్కున్న ఆస్ట్రేలియా నేత!
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వేట సర్వసాధారణం. అక్కడి అడవుల్లో నిత్యం వేటగాళ్ల తుపాకీ గుళ్లకు మూగ జీవాలు ఎన్నో బలైపోతుంటాయి. అయితే ఆస్ట్రేలియాకు చెందిన చట్టసభ ప్రతినిధి రాబర్ట్ బొర్సాక్ గత రాత్రి సభలో మాట్లాడుతూ, తాను ఏనుగును చంపానని గొప్పగా చెప్పుకున్నారు. అంతటితో ఆగని రాబర్ట్ ఏనుగు మాంసం దుప్పి మాంసంలా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో దుప్పులను కూడా ఆయన వేటాడినట్టు తెలుస్తోంది. ఏనుగు మెడ, తల భాగాన్ని వెన్నతో వేపుడు చేసుకుని తింటే 'ఆ టేస్టే వేరు' అంటూ సభలోనే లొట్టలు వేశారు. సరదా కోసం ఏనుగును చంపడం అమానుషమని, అలాంటిది ఓ ప్రతినిధి ఏనుగును చంపి తిన్నానని గర్వంగా చెప్పారంటే ఆయన ఆ పదవికి అనర్హుడని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన ప్రారంభించారు.