: ఆలస్యంగా వచ్చిన ఒక ఎంపీ కోసం ప్రత్యేక రైలు నడిపారు!


ఒక మహిళా ఎంపీ ఆలస్యంగా రావడంతో ఆమె ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో, ఒక ప్రత్యేక రైలును అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు. దీంతో, ప్రయాణికులు ఇబ్బంది పడిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ మధ్యప్రదేశ్ లోని బినా జిల్లాలో ఉన్నారు. ముంబయిలో రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. బినా నుంచి రైలు మార్గం ద్వారా భోపాల్ చేరుకుని, అక్కడ నుంచి విమానంలో ముంబయికి వెళ్లాల్సి ఉంది. అయితే, బినా రైల్వేస్టేషన్ కు ఆమె ఆలస్యంగా చేరుకోవడంతో, ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో, రెండు బోగీల ప్రత్యేక రైలును అధికారులు హడావుడిగా ఏర్పాటు చేశారు. వెంటనే, ఆ ప్రత్యేక రైలు ఎక్కిన ఎంపీ భోపాల్ చేరుకుని, వెంటనే విమానాశ్రయానికి వెళ్లి ముంబయి విమానం ఎక్కారు. కానీ, సాధారణ ప్రయాణికులే ఇబ్బంది పడ్డారు. ఉన్నపళంగా పట్టాలెక్కిన ఈ కొత్త రైలు కారణంగా రెగ్యులర్ గా వెళ్లే రైలు సర్వీసులను కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే, ఈ విషయమై రైల్వే అధికారులు మాత్రం నోరుమెదపటం లేదు.

  • Loading...

More Telugu News