: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్సీ మధ్య వాగ్యుద్ధం


తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈరోజు ఇక్కడ నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష రసాభాసగా మారింది. ఇరువురి అనుచరులు తోపులాటకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారి తీశాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడింది. కాగా, రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా ‘నవ నిర్మాణ దీక్ష’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్రజలతో దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.

  • Loading...

More Telugu News