: కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన కళానిధి మారన్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు యజమాని కళానిధి మారన్ ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ సీజన్ 9 టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు గెలుచుకోవడంతో ఆ ఆనందం పంచుకునేందుకు కేసీఆర్ ను ఆ జట్టు యాజమాన్యం కళానిధి మారన్, సన్ గ్రూప్ సీఈవో షణ్ముగం, జెమినీ టీవీ ఎండీ కిరణ్, జీఎం బాలకృష్ణన్ లు కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఏడు ఐపీఎల్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాదులో నిర్వహించనున్నారని, వాటికి సహాయ సహకారాలు అందించాలని కేసీఆర్ ను కోరినట్టు వారు తెలిపారు. దీనికి కేసీఆర్ అంగీకరించారని ఆయన చెప్పారు. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు టైటిల్ గెలుచుకోవడం హైదరాబాదుకు, తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News