: ఎల్బీనగర్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 50 కిలోల ఎపిడ్రిన్ మత్తు పదార్థాలు స్వాధీనం
హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్ సమీపంలో డీఆర్ఐ అధికారులు ఈరోజు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. 50 కిలోల ఎపిడ్రిన్ మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతోన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి నిందితులు ఎపిడ్రిన్ మత్తు పదార్థాల్ని చెన్నైకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.