: భారత్ మ్యాప్ లో పొరపాటున ‘పాక్’ ను కలిపేశారు!


భారత్ మ్యాప్ లో పాకిస్థాన్ ను కూడా పొరపాటున కలిపి ముద్రించిన సంఘటన మొరాకోలో జరిగింది. భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మొరాకో పర్యటనలో భాగంగా మహ్మద్ వి.యూనివర్శిటీలో ప్రసంగించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి అధికారులు స్వాగతం పలుకుతూ, భారతదేశ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే, ఆ చిత్రపటంలో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ ను కూడా కలిపేశారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత అధికారులు యూనివర్శిటీ సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆ చిత్రపటం ఉన్న పోస్టర్లను అక్కడి నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News