: హైద‌రాబాద్‌కు డ్రీమ్‌వ‌ర్క్స్, లింక్డ్ ఇన్, స్కేల్ ఫోర్స్ కంపెనీలు: కాలిఫోర్నియాలో కేటీఆర్‌


పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే లక్ష్యంగా అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ బృందం ఇప్పటికి అక్క‌డి 5 రాష్ట్రాల్లో పర్యటించింది. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా కాలిఫోర్నియాలో ఓ తెలుగు టీవీ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ‌లో యువ‌త‌కు అత్య‌ధిక ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. హాలీవుడ్ స్టూడియో డ్రీమ్‌వ‌ర్క్స్ హైద‌రాబాద్‌లో ఫిలింసిటీ నిర్వ‌హించ‌నుంద‌ని, దానితో న‌గ‌రం గ్లోబ‌ల్ సిటీగా మారిపోతుందని అన్నారు. మ‌రోవైపు తెలంగాణలో పర్యటించి త‌మ‌ కార్యాలయ స్థాపనపై వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ప్రొఫెష‌న‌ల్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌ లింక్డ్ ఇన్ ఓ నిర్ణయం తీసుకోనుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. స్టార్ట‌ప్ ల‌తో పాటు స్కేల‌ప్ విధానాన్ని కొన‌సాగించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. స్కేల్ ఫోర్స్ కంపెనీ త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో రిక్రూట్ మెంట్ నిర్వ‌హించ‌నుంద‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News