: పనమ్మాయిని పట్టించుకోని రేణుకా చౌదరి... తిట్టిపోస్తున్న నెటిజన్లు!


తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ చిన్న పాపను చూసుకునేందుకు రేణుక నియమించుకున్న అమ్మాయిని కూడా రెస్టారెంట్ కు తీసుకువెళ్లిన రేణుక, ఆమెకు భోజనం పెట్టించలేదు సరికదా, కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. రేణుక ఫ్యామిలీ భోజనం పూర్తయ్యేంత వరకూ ఆ అమ్మాయి, చిన్న బాబు వెనకాల నిలబడే ఉంది. ఎప్పుడు జరిగిందో తెలియని ఈ దృశ్యాన్ని రిషీ బాగ్రీ అనే వ్యక్తి, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, దీన్ని 1700 మందికి పైగా షేర్ చేస్తూ, రేణుకా చౌదరిపై విరుచుకుపడ్డారు. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన మహిళ, ఇలా చేస్తారా? అని ఒకరు, తిండి పెట్టించేందుకు డబ్బు లేకుంటే, పనమ్మాయిని తీసుకెళ్లకుండా ఉండాలని ఇంకొకరు, కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇలాగే ఉంటుందని మరొకరు, పెద్దల ఇళ్లలో పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆధునిక యుగపు బానిసల జీవితం ఇంతేనని... ఇలా సాగుతున్నాయి ఆమెపై విమర్శలు. రేణుక పక్కనే నిలబడ్డ అమ్మాయి చిత్రం వైరల్ అవుతుండగా, ఘటనపై ఆమె మాత్రం స్పందించలేదు.

  • Loading...

More Telugu News