: ఏపీతో గొడవలు కోరుకోవడం లేదు, విద్వేషాలు వద్దు: కేసీఆర్
_1684.jpg)
‘ఏపీతో గొడవలు కోరుకోవడం లేదు, విద్వేషాలు వద్దు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు వద్దని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుకి ఇదే నా వినతి’ అని అన్నారు. కృష్ణా, గోదావరిలో 3855 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉన్నాయని, ఆ నీళ్లతో 4కోట్ల ఎకరాలు సాగు చెయ్యొచ్చని కేసీఆర్ చెప్పారు. తాము కోటి ఎకరాలకు మాత్రమే సాగునీరు తీసుకుంటామని చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఏడు నెలల పాటు పాలన సరిగా సాగలేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో గవర్నర్ సహకారం మరువలేనిదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి రేటు జాతీయ రేటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ 2లక్షల కోట్లు దాటుతుందని అన్నారు. 2024 నాటికి 5లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు.