: అభివృద్ధికి బీజేపీ పర్యాయ పదంగా మారింది: మోదీ
బీజేపీ అభివృద్ధికి పర్యాయ పదంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. జన్ ధన్ యోజన నుంచి ఎల్‌పీజీ పథకం వరకు పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టామన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలననందిస్తోందని ఆయన అన్నారు. ఒడిశాలో తమ పార్టీ అధికారంలో లేదని, అందుకే అక్కడ పరిస్థితులు బాగోలేవని మోదీ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రతీ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, వారి సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఒడిశాలో అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం జరగడం లేదని అన్నారు.