: 'హౌస్ ఫుల్ 3' చిత్ర బృందంపై కేసు నుమోదు


'హౌస్ ఫుల్ 3' చిత్ర బృందంపై ముంబైలో కేసు నమోదైంది. బాలీవుడ్ రచయిత, లిరిసిస్ట్ ఫరూఖ్ బరేల్వి హౌస్ ఫుల్ 3 దర్శకుడు సాజిద్ నడియాడ్ వాలా, ఇతర చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కథను 'తిగ్ డాంబాజ్' పేరుతో గతంలో తాను రాశానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని అక్షయ్ కుమార్ కు వినిపించానని, ఆయనకు కధ చెప్పినప్పుడు ఆయన మేకప్ మెన్ నరేంద్ర కుశ్వ కూడా అక్కడ ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం తనతో నరేంద్ర కుశ్వ మాట్లాడుతూ, అక్షయ్ కు కథ నచ్చిందని, సినిమా తీద్దామనుకుంటున్నారని చెప్పారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. తరువాత అదే కథను సాజిద్ నడియాడ్ వాలా 'హౌస్ ఫుల్ 3'గా తీశారని ఆయన పోలీసులకు చెప్పారు. ఫిర్యాదు స్వీకరించామని చెప్పిన పోలీసులు, ఇంకా ఎవరి మీదా కేసు నమోదు చేయలేదని అన్నారు.

  • Loading...

More Telugu News