: శాన్‌ఫ్రాన్సిస్కోలో కేటీఆర్ బిజీ బిజీ
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్కడి అధికారులతో హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల స్థాపనకు ఉన్న విస్తృత అవకాశాలను వివరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రిబ్రౌన్‌తో కేటీఆర్ ఈరోజు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ప్రపంచంలోని 13 ఫ్రావిన్స్‌ల నుంచి ప్రతినిధులతో అక్కడ ఏర్పాటు చేసిన క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో అవలంబిస్తోన్న పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీపై కాలిఫోర్నియా గవర్నర్ కు కేటీఆర్ తెలిపారు. పర్యటనలో భాగంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ఆఫీస్‌లో కేటీఆర్ తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.