: భండారీ ఆహ్వానం మేరకే అతడి స్టాల్ సందర్శన!... ఆయుధ వ్యాపారితో సంబంధాలు లేవన్న అశోక్ గజపతిరాజు


వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో తనకు సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ వ్యవహారంలో దాచుకోవాల్సినదేేమీ లేదని కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన గజపతిరాజు... ఆయుధ వ్యాపారిగా ఉన్న అతడితో తనకు పెద్దగా సంబంధాలు లేవని తెలిపారు. అయితే బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో భండారీ ఆహ్వానిస్తేనే అతడి స్టాల్ ను సందర్శించానని ఆయన తెలిపారు. అంతకుమించి భండారీతో తనకు సంబంధాలేమీ లేవని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News