: వానలు వాపస్ రావాలే... కోతులు వాపస్ పోవాలె: కేసీఆర్


ఆంధ్రాపాలకుల హయాంలో తెలంగాణలో పచ్చదనమంతా హరించుకుపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ, ఆయన ప్రసంగిస్తూ, "తెలంగాణలో 33 శాతం అడవులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 23 శాతమే అడవులున్నాయి. ఒకనాడు అడుగడుగునా చెట్లతో దట్టమైన అడవులతో తెలంగాణ ఉంది. పూర్వవైభవాన్ని పునరుద్ధరించేందుకు మళ్లీ, నిండుగా వానలు కురిసేందుకు వీలుగా తెలంగాణకు హరితహారమనే ఉత్తమమైన పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. వానలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలే... అనే నినాదమిచ్చి, ఊరూ వాడా పిల్లా పెద్దా అందరినీ భాగస్వాములుగా చేసి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని, హైదరాబాద్ లో మరో 10 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే మూడేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ సాధించే దిశగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం" అని అన్నారు. ఈ పథకంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, జూలై నుంచి హరితహారం మొదలవుతుందని కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News