: ఐఎస్ఐఎస్ పై బ్రిటన్ కొత్త ఆయుధం 'బాలీవుడ్ మ్యూజిక్'... సత్ఫలితాలు కూడా!


ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా బాలీవుడ్ సంగీతాన్ని బ్రిటన్ వాడుకోవడం ఏంటని అనుకుంటున్నారా? నిజమే. లిబియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మానసికంగా దెబ్బతీయాలంటే, బాలీవుడ్ మ్యూజిక్ మంచి ఆయుధమని ఓ పాకిస్థానీ ఇంటెలిజన్స్ ఆఫీసర్ సలహా ఇవ్వగా, దాన్ని అమలు చేస్తున్న బ్రిటన్ దళాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయట. జన్మతః పాకిస్థాన్ వాసి అయినప్పటికీ, బ్రిటీష్ ఆర్మీలో పనిచేస్తున్న అధికారి, బాలీవుడ్ సంగీతం ఇస్లాం మత విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకమని, దాన్ని మానసిక ఆయుధంగా వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారని, దాన్నిప్పుడు లిబియాలో పోరాడుతున్న బ్రిటన్ ప్రత్యేక దళాలు వాడుతున్నాయని 'డైలీ మిర్రర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో జేఎస్ఓపీ (జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్) పెద్ద ధ్వనితో బాలీవుడ్ హిట్ పాటలను వినిపిస్తోందట. వీటిని వింటున్న కరుడుగట్టిన ముస్లిం ఉగ్రవాదుల మనసు డిస్టర్బ్ అవుతోందని, దీంతో వారిని మరికొంచెం సులువుగా ఏరిపారేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా షరియా చట్టాలు కఠినంగా అమలవుతున్న షిర్తే ప్రాంతంలో రెండు కార్ల నిండా బాలీవుడ్ సంగీతం ఉన్న సీడీలను పంచిపెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. అక్కడి రేడియోల్లో సైతం ఇవే పాటలను వినిపిస్తూ, చానళ్లలో ప్రసారం చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నామని సైన్యాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News