: ఒకే సిరీస్ లో వెయ్యి నిమిషాలు క్రీజులో నిలిచిన క్రికెటర్ గా కోహ్లీ!


ఇటీవల ముగిసిన ఐపీఎల్-9 సిరీస్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ఒకే సిరీస్ లో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ... ఇప్పటిదాకా జరిగిన అన్ని ఐపీఎల్ సిరీస్ లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గానూ అతడు రికార్డులకెక్కాడు. మొన్నటిదాకా ఈ రికార్డు గుజరాత్ లయన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సురేశ్ రైనా పేరిట ఉంది. మొన్నటి సిరీస్ లో ఏకంగా 973 పరుగులు చేసిన కోహ్లీ... రైనా రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఏ ఒక్కరికీ తెలియని కోహ్లీ రికార్డు మరొకటి ఉంది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ రికార్డుపై జాతీయ మీడియా ఆసక్తికర కథనాలు రాసింది. ఒకే సిరీస్ లో ఏకంగా వెయ్యి నిమిషాల పాటు క్రీజులో గడిపిన క్రికెటర్ గా కోహ్లీ ఈ ఐపీఎల్ సిరీస్ లో అరుదైన రికార్డు సాధించారు. ఇక ఏ ఒక్క క్రికెటర్ కు సాధ్యం కాని రీతిలో ఈ సిరీస్ లో కోహ్లీ 36 సిక్సర్లను బాదాడు!

  • Loading...

More Telugu News