: అడుగులో అడుగు వేసుకుంటూ... పాదయాత్రగా ప్రతిజ్ఞకు చంద్రబాబు
ఓ పక్క ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు... మరోవైపు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ... వెనుకే ఉద్యోగులు, టీడీపీ నేతలు, బెజవాడ నగర ప్రజలు వెంట రాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం నవ నిర్మాణ దీక్షకు బయలుదేరారు. బెజవాడలోని డీవీ మేనర్ హోటల్ నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్రకు బెజవాడ నగర ప్రజలు భారీగానే స్పందించారు. స్వచ్ఛందంగా వందలాది మంది చంద్రబాబు వెంట నడిచేందుకు రోడ్డెక్కారు. పాదయాత్ర సందర్భంగా అశోక్ బాబుతో పాటు ఇటు మురళీకృష్ణతో ముచ్చటిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.