: చైన్ స్నాచింగ్‌లు 70 శాతం మేర తగ్గాయి: సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ నగరంలో నేరాలు భారీ స్థాయిలో అదుపులోకొచ్చాయని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడుస్తోన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖకు మంచి మద్దతు నిస్తోందని తెలిపారు. నగరంలో చైన్ స్నాచింగ్‌లు 70 శాతం మేర తగ్గాయని, నగరంలో శాంతి భద్రతల కోసం పోలీస్ శాఖ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులపై ప్రజలకు మంచి నమ్మకం కలుగుతోందని సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసులపై అవినీతి ఆరోపణలు తగ్గాయని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతోందని అన్నారు.