: 'అమ్మ' కేసును తేల్చేందుకు మూడు మార్గాలు... ఏం చేద్దాం?: సుప్రీంకోర్టు
తమిళనాడు సీఎం జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జయలలిత కేసు పరిష్కారానికి మూడు మార్గాలున్నాయని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు ఏం చేద్దామని అడిగారు. హైకోర్టు తీర్పును సమర్ధించడం ఒకటైతే, తిరస్కరించి జైలు శిక్షను ఖరారు చేయడం రెండోదని, లేకుంటే కేసును మొదటి నుంచి తిరిగి విచారించాలని హైకోర్టునే మరోసారి ఆదేశించాల్సి వుంటుందని అన్నారు. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్, తీర్పులో హేతుబద్ధత లోపించిందని వివరించారు. ఆస్తుల సంపాదన నేరం కాదని, అక్రమంగా సంపాదిస్తేనే నేరమని అభిప్రాయపడ్డ కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.