: ఎన్నికల్లోపు భారీగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నందున ఉద్యోగ నియామకాల ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) మిన్నీ మాథ్యూస్ సమీక్ష నిర్వహించారు. సుమారుగా 55 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎస్ కు వివరించారు. వీటిని వచ్చే ఎన్నికల్లోపు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఖాళీల్లో 22వేల టీచర్ పోస్టులు, ఆరోగ్య శాఖలో 10వేల పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.