: తెలంగాణ వచ్చాకే అస్థిరపరిచే కుట్రలు జరిగాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అస్థిరపరిచే కుట్రలు జరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమైందని, పార్టీలో చేరికలు వలసలు కావని, పునరేకీకరణ మాత్రమేనని, రెండేళ్లలో రాజకీయ సుస్థిరత సాధించామని అన్నారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డిని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపిన నేత చెన్నారెడ్డి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ఆంధ్రా శక్తులు అనేక ప్రయత్నాలు చేశాయని, 1969లోనే తెలంగాణ వచ్చుంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని కేసీఆర్ అన్నారు.