: అర్బాజ్ ఖాన్ తో నటిస్తున్న సంగతి నిజమే: సన్నీలియోన్


బాలీవుడ్ మీడియాలో వస్తున్న రూమర్లు నిజమేనని శృంగార తార సన్నీలియోన్ తెలిపింది. వైవాహిక బంధం బద్దలై బాధలో ఉన్న అర్బాజ్ ఖాన్ తో ఓ ఆఫర్ సన్నీలియోన్ తలుపుతట్టిందని, దీంతో సన్నీ ఫేట్ మారిపోనుందని బాలీవుడ్ లో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై స్పందించిన సన్నీలియోన్ ఆ వార్తలన్నీ నిజమని చెప్పింది. తన తరువాతి సినిమాలో అర్బాజ్ ఖాన్ తో నటిస్తున్నానని వెల్లడించింది. సినిమా పేరు ఇంతెజార్ (ఎదురుచూపు) అని చెప్పింది. అర్బాజ్ తో నటించడంపై సంతోషం వ్యక్తం చేసింది. అతనితో నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. బాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. జీవితంలో ఎప్పుడేం జరగుతుందో తెలియదు కానీ, జరిగే ప్రతి దానికి ఓ కారణముంటుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News