: నేను బయలుదేరుతున్నానంటే రాష్ట్రం గడగడలాడేది: సీఎం చంద్రబాబు
‘2004 కంటే ముందు నేను బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం గడగడలాడేది’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు, ‘2004 కంటే ముందు నేను ఎక్కడికి పోతున్నానో చెప్పేవాడిని కాదు. నేను వెళ్లిన తర్వాతే తెలిసేది. ఆకస్మిక తనిఖీలు, ఫైల్స్ క్లియరెన్స్.. నేను ఏ పని చేసినా ఆ భయమనేది ఉండేది. ఆ భయంతో పనిచేశారు.. అదే మాదిరిగా ఫలితాలు కూడా వచ్చాయి. కానీ, ఆరోజు చేసే పనికి, ఈరోజు చేసే పనికి ఒక తేడా ఉంది. ఇప్పుడు నేను చేసే పని ఒక ఫోకస్ తీసుకొని, అదేమాదిరి, అందరికీ ఒక బాధ్యత తీసుకువచ్చి, టెక్నాలజీ ఉపయోగించి ఫలితాలు రాబట్టేలా ముందుకు పోతున్నాము. అప్పటికీ, ఇప్పటికీ తేడా అదే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.