: బీహార్ టెన్త్ 'టాపర్' సమాధానాలు విని నవ్వుతున్న నెటిజన్లు


బీహార్ లో 10వ తరగతి పరీక్షలు కఠినంగా నిర్వహించామని అధికారులు ప్రకటించారు. అన్నట్టుగానే కేవలం 50 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. దీంతో పరీక్షలు కఠినంగా నిర్వహించారంటూ పలువురు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ పరీక్షలో 500 మార్కులకు గాను 444 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన రూబీ రేను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ జర్నలిస్టు వెళ్లారు. ఆయన అడిగిన ప్రశ్నలకు రూబీ చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పొలిటికల్ సైన్స్ ను ఔపోసన పట్టి ఉంటుందని భావించిన జర్నలిస్టు, సదరు సబ్జెక్టులో అన్ని మార్కులు రావడాన్ని ఎలా భావిస్తున్నారని అడగ్గానే, పొలిటికల్ సైన్స్ అంటే వంటలకు సంబంధించిన శాస్త్రమని తెలిపింది. దీంతో షాక్ కు గురైన జర్నలిస్టు, మోస్ట్ రియాక్టివ్ మూలకం ఏంటని అడిగాడు. దీనికి అల్యూమినియం అని సమాధానం చెప్పింది. దీంతో ఆవిడను ఇంకా ఎక్కువ మాట్లాడించడం సరికాదని భావించిన ఆయన సంభాషణకు సెలవు ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, బీహార్ లో పరీక్షలంటే మాస్ కాపీయింగ్ అన్న ముద్ర ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News