: ప్రత్యేక హోదా వస్తే, చాలా భారం తగ్గుతుంది: సీఎం చంద్రబాబు
_8279.jpg)
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే చాలా భారం తగ్గుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరలేదని, కేంద్రం నుంచి సరైన సహకారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. మనకు వనరులు ఉన్నాయని, సంపద సృష్టించుకునే శక్తి కూడా ఉందని, విభిన్న ఆలోచనల ద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పరిపాలనలో ఉదాసీనత లేకుండా అన్ని శాఖల్లో పారదర్శకత తీసుకువచ్చామని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.