: ఓపెన్ డ్రెయిన్లో పడి, అందులోనే ఇరుక్కుపోయిన ఏనుగుపిల్ల అవస్థలు!


ఓపెన్ డ్రెయిన్ లో పడిపోయిన ఒక ఏనుగుపిల్ల అందులో ఇరుక్కుపోవడంతో బయటకు వచ్చేందుకు నానా తిప్పలు పడ్డప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటన శ్రీలంకలోని హంబన్తోట అనే ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఓపెన్ డ్రెయిన్ ఉన్న చోట నుంచి వెళ్తున్న ఈ ఏనుగుపిల్ల కాలు జారి అందులో పడిపోయింది. అందులో ఇరుక్కుపోయిన ఆ ఏనుగుపిల్ల బయటకు రాలేకపోయింది. దీంతో, అక్కడి ప్రజలు దానికి తాళ్లు కట్టి జాగ్రత్తగా బయటకు లాగి దాని ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News