: మద్యం మత్తులో పక్షవాతపు తండ్రికి నిప్పంటించిన కొడుకు ఆత్మహత్యాయత్నం


మద్యం మత్తులో పక్షవాతపు తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆ తర్వాత కొడుకు కూడా ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని కొత్తూరులో నిన్న రాత్రి జరిగింది. శంకర్(70)కు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు మారయ్య, చిన్న కొడుకు లక్ష్మణ్. శంకర్ భార్య చనిపోయి చాలా రోజులైంది. పెద్దకొడుకు ఇదే గ్రామంలో వేరుగా నివసిస్తున్నాడు. లక్ష్మణ్ మాత్రం తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఫుల్ గా మద్యం సేవించి వచ్చిన లక్ష్మణ్ ఇంటికి వెళ్లి... ‘ఇంకా ఎన్నిరోజులు నీకు సేవచేయాలంటూ’ ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న తన తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తనపై కూడా పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు వ్యాపించడంతో ఆ బాధకు ఇద్దరూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఇద్దరినీ మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు.

  • Loading...

More Telugu News