: తన బిడ్డలా ఇంకెవరూ చావకూడదని కోరుకుంటున్న ఆవు, నాలుగేళ్లుగా ఆ బస్సును ఓ కంట కనిపెడుతోంది!
ఒక ఆవు నాలుగేళ్లుగా బస్సుని కాపలా కాయడమేంటని అనుమానం వచ్చిందా?... అవును నిజం! ఉత్తర కర్ణాటకలోని ఓ పట్టణంలో నాలుగేళ్ల క్రితం ఓ ఆవు దూడను బస్సు డ్రైవర్ ఢీ కొట్టాడు. కళ్లముందే దూడ మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఆవు ఆ బస్సు డ్రైవర్ ను గుర్తుపెట్టుకుంది. ఆయన ఆ రూట్ లో వస్తే చాలు, ఆయన వేగంగా వెళ్లినా, సిగ్నల్ దగ్గర ఆగకపోయినా అది బస్సుకు అడ్డంగా వెళ్తుంది. బస్సును అంగుళం కూడా కదలనీయదు. దీనిని గమనించిన డ్రైవర్ బస్సు రంగును మార్చాడు. అయిన ఫలితం లేదు. ఈ ఆవు మరెవరినీ ఏమీ అనదు. కేవలం ఆయనను మాత్రమే అడ్డుకుంటుంది. మెల్లగా వెళ్లేలా చూస్తుంది. దీంతో కొంతమంది ఓ సారి దానిని కర్రలతో కొట్టి దూరంగా తరిమేసేందుకు ప్రయత్నించగా, అది పట్టించుకోలేదు. దీంతో దీనిని ఆ ప్రాంతంలో అంతా వింతగా చెప్పుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఆ ఆవు ఆ డ్రైవర్ మరో యాక్సిడెంట్ చేయకుండా కాపలా కాయడం విశేషమే మరి!