: కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్ దంపతులకు ఎన్టీఆర్ స్మారక పురస్కారం


చలనచిత్రరంగానికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్, సుమలత దంపతులు ఎన్టీఆర్ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేసి వారిని సత్కరించనున్నట్లు చెప్పారు. కాగా, 1972లో ‘నాగరహావ్’ చిత్రం ద్వారా చలన చిత్ర రంగంలోకి ప్రవేశించిన అంబరీష్ ఇప్పటివరకు రెండు వందల చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటి సుమలతను 1992లో ఆయన వివాహం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా అయిన అంబరీష్ ఎమ్మెల్యే, ఎంపీగానే కాకుండా మంత్రి గా కూడా చేశారు.

  • Loading...

More Telugu News