: రౌడీయిజం చేస్తే తాట తీస్తా... అవినీతిపరుల అంతు చూస్తా: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ


రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతి పరుల అంతు చూస్తానని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హెచ్చరించారు. మాజీ ఐపీఎస్ అధికారిణి అయిన కిరణ్ బేడీ తన సర్వీస్ లో రౌడీలు, అసాంఘిక శక్తులను నిద్రపోనీకుండా చేసిన విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొత్త బాధ్యతలు చేపట్టిన ఆమె తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని, ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని బేడీ అన్నారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకుగాను ‘1031’ అనే హెల్ప్ లైన్ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News